Virat kohli: ఇక గుడ్ బై చెప్పేద్దామా…? ఆలోచనలో పడ్డ రోహిత్, విరాట్…!
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Kohli) అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారా…? అంటే అవును అనే సమాధానం వినపడుతోంది. గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) అలాగే రోహిత్ శర్మ (Rohith Sharma) ఆస్ట్రేలియా తో సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ప్రధానంగా రోహిత్ శర్మ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ లో అసలు ఏమాత్రం రోహిత్ శర్మ ఆకట్టుకోలేదు.
కెప్టెన్ గా కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా రెండు టెస్టుల్లో చేయకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆస్ట్రేలియా సిరీస్ లో రాణిస్తాడని చాలామంది ఎదురు చూశారు. అయినా సరే పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. మొదటి టెస్ట్ లో సెంచరీ చేసి ఊపులో ఉన్నాడని భావించినా ఆ తర్వాత రెండు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. దీనితో కోహ్లీపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.
ఒకపక్క యువ ఆటగాళ్లు తుది జట్టులో చోటు కోసం ప్రయత్నాలు చేస్తుంటే… కెప్టెన్ గా రోహిత్ శర్మ అలాగే సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శనలు చేయకపోవడం పట్ల జట్టు యాజమాన్యం కూడా సీరియస్ గానే ఉంది. దీనితో రాబోయే రెండు టెస్టుల్లో ప్రభావం చూపించకపోతే మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వన్డేల్లో మాత్రం కొనసాగి టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని… ఆ తర్వాత ఐపీఎల్ లో కొనసాగాలని భావిస్తున్నారట. అయితే విరాట్ కోహ్లీ మాత్రం కొంతకాలం క్రికెట్ ఆడే అవకాశం ఉందని రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా గుడ్ బై చెప్పవచ్చని భావిస్తున్నారు. ఇక నాలుగో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనింగ్ కు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.






