Vinod kambli: సచిన్ నా కోసం చాలా చేసాడు, మెడికల్ బిల్స్ తో సహా అన్నీ చూసుకున్నాడన్న కాంబ్లి
జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల లేకపోతే భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి వినోద్ కాంబ్లి ప్రత్యక్ష ఉదాహరణ. వచ్చిన డబ్బును ఎంజాయ్ చేయడం కంటే భవిష్యత్తుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఈ విషయంలో కాంబ్లి(Vinod kambli) ఒక ప్లాన్ లేకుండా కెరీర్ నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో కాంబ్లి పోరాడుతున్నాడు. ఈ సమయంలో కపిల్ దేవ్ (Kapil dev)… అతనికి అండగా నిలిచాడు. సపోర్ట్ చేస్తాను అంటూ ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ తరుణంలో తాజాగా కాంబ్లి కీలక వ్యాఖ్యలు చేసాడు.
2009 లో జరిగిన ఒక ఘటన గురించి మీడియాతో పంచుకున్నాడు. కాంబ్లీ… సచిన్‌తో తన స్నేహం గురించి, ముఖ్యంగా 2009 సంఘటన గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. సచిన్ (Sachin tendulkar) తనకు వెన్నుపోటు పొడిచాడని కాంబ్లీ అప్పట్లో ఆరోపణలు చేసాడు. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు. 2013లో సర్జరీలు చేయించుకున్నప్పుడు టెండూల్కర్ తనకు అనేక మెడికల్ బిల్స్ పే చేసాడని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో, సచిన్ సహాయం చేయలేదని తాను అనుకున్నాను అని తీవ్ర నిరాశకు గురయ్యాను అని చెప్పుకొచ్చాడు.
కానీ 2013లో తనకు జరిగిన రెండు సర్జరీలకు డబ్బు చెల్లించడంతోపాటు సచిన్ తన కోసం అన్నీ చేసినట్టు చెప్పుకొచ్చాడు. అప్పుడే తాము మాట్లాడుకున్నామని అన్నాడు. సచిన్ నాకు ఎలా ఆడాలో చెప్పేవాడు అని… తాను తొమ్మిది సార్లు పునరాగమనం చేసాను అని గుర్తు చేసుకున్నాడు. మేము క్రికెటర్లం, తాము గాయపడటం సహజం అని గుర్తు చేసుకున్నాడు. తన క్రికెట్ మైలురాళ్లలో కొన్నింటిని గుర్తుచేసుకుంటూ, 1990లలో వాంఖడేలో అతను సాధించిన డబుల్ సెంచరీని గుర్తు చేసుకున్నాడు. అచ్రేకర్ సార్ అప్పుడు తనతో ఉన్నారని గుర్తు చేసుకున్నాడు. తన ప్రయాణం పరిపూర్ణంగా లేదని కాని తాను చాలా కోల్పోయాను అంటూ చెప్పుకొచ్చాడు.






