Jasprit Bumrah: ఆ ఇద్దరే మా ప్లాన్ నాశనం చేసారు, బూమ్రా, ఆకాష్ దీప్ పై వెట్టోరి కామెంట్స్
భారత టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), ఆకాష్ దీప్ నెలకొల్పిన భాగస్వామ్యమే తమకు మ్యాచ్ ను దూరం చేసిందని ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్ డానియల్ వెట్టోరి వ్యాఖ్యానించాడు. భారత్ ను ఫాలో-ఆన్ ఆడించాలని ప్రయత్నం చేసామని… కాని తమ ప్లాన్ మొత్తం ఆ జోడి తిప్పి కొట్టిందన్నాడు. భారత బ్యాటర్లు, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లు భారీ అర్ధ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా పట్టు సడలింది. వారి వ్యూహాన్ని ముందు ఈ ఇద్దరూ సమర్ధవంతంగా తిప్పి కొట్టారు. జడేజా స్వేచ్చగా బ్యాటింగ్ చేయడం కూడా ఆస్ట్రేలియాకు మైనస్ అయింది.
అనంతరం నితీష్ దాదాపు 11 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసాడు. ఇక బుమ్రా, ఆకాష్ దీప్ ల పోరాటంతో 39 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు పరీక్ష పెట్టారు. దీనికి తోడు వర్షం కూడా భారత్ కు కలిసి వచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ కు పలు మార్లు అంతరాయం కలిగింది. ఫాలో ఆన్ భారత్ ఆడి ఉంటె కచ్చితంగా మ్యాచ్ లో తాము పట్టు బిగించే వాళ్ళమని అన్నాడు వెట్టోరి. జడేజా ( Ravindra jadeja) అవుట్ అయినప్పుడు మాకు నిజంగా మంచి అవకాశం దొరికిందని, త్వరగా వారిద్దరిని అవుట్ చేయవచ్చని అంచనా వేసామన్నాడు.
ఆకాష్ దీప్ ప్రధానంగా ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టాడని అన్నాడు. 213 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోగా అప్పుడు బ్యాటింగ్ కు దిగిన ఆకాష్ దీప్ మంచి షాట్లు ఆడాడని అన్నాడు. 33 పరుగులు భారత్ చేసే అవకాశం లేదని అంచనా వేసినట్టు చెప్పుకొచ్చాడు వెట్టోరి. వర్షం లేకుండా తమ బౌలర్లు 90 ఓవర్లు పూర్తి చేసి ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేది అన్నాడు. ఇక తమ సీనియర్ బౌలర్ దూరం కావడం ఆస్ట్రేలియా గేమ్ ప్లాన్ను ప్రభావితం చేసిందన్నాడు. రెయిన్ బ్రేక్ కారణంగా కమ్మిన్స్, స్టార్క్ పై ఒత్తిడి తగ్గిందన్నాడు.






