America :అమెరికాలో వరస దాడులు… 24 గంటల్లోనే
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అమెరికా(America)లో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. న్యూ ఆర్లియన్స్(New Orleans ) లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్ (Las Vegas )లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






