Delhi: రష్యాతో చమురు డీల్ ఎఫెక్ట్.. అమెరికా ట్యాక్స్ పర్యవసానాలు పరిశీలిస్తున్న భారత్..

ఉక్రెయిన్-రష్యా పోరాటం సంగతేమో కాని మధ్యలో భారత్ కు ఇబ్బందులు తప్పడం లేదు. తమ మాట రష్యా వినడం లేదన్న కోపంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump).. రష్యాతో చమురు డీల్ కొనసాగిస్తున్న భారత్ 25 శాతం ట్యాక్స్, అదనంగా ఫెనాల్టీలు తప్పవని ట్రంప్ తేల్చేశారు. అంతేకాదు.. ఆదేశాలవి డెడ్ ఎకానమీలంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ ట్యాక్స్ కూడా ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
రష్యా (Russia)తో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. వారి ఆర్థికవ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్నారు. ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఈసందర్భంగా రష్యా, యూఎస్‌లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టంచేశారు.
రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్‌తో సహా పలు దేశాలను ఇటీవల పలుమార్లు అమెరికా హెచ్చరిస్తూ వచ్చింది. ఈక్రమంలో ఇదే కారణాన్ని చూపుతూ.. భారత దిగుమతులపై 25శాతం సుంకంతో పాటు, పెనాల్టీలు కూడా విధించారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో న్యూఢిల్లీ ఒకటని ఆరోపించారు.
రష్యా నుంచి దిగుమతుల కారణంగా యూఎస్ పెనాల్టీలకు గురైన తొలి దేశం భారత్. ఈ సుంకాలపై భారత్ స్పందిస్తూ.. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది.