Vanguard: హైదరాబాద్‌లో వాన్గార్డ్ గ్లోబల్ వాల్యూ సెంటర్
                                    అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్గార్డ్ తమ గ్లోబల్ వాల్యూ సెంటర్ (జీవీసీ) (Vanguard Global Value Center) హైదరాబాద్‌లో ప్రారంభించింది. భారత్‌లో ఇంతకాలం భాగస్వామ్య సంస్థల ద్వారా సేవలు అందుకున్న ఈ కంపె, ఇప్పుడు సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సందర్భంగా వాన్గార్డ్ ఇండియా కేంద్రం హెడ్ వెంకటేశ్ నటరాజన్ (Venkatesh Natarajan) , గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ కౌటూర్ (John Couture) మాట్లాడుతూ మొత్తం మూడు ప్రాంతాల్లో 1.6 లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయాన్ని ర్పాటు చేస్తున్నాం. నాలుగేళ్లలో 2,3000 ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు.
హైటెక్‌సిటీలోని నాలెడ్జ్పార్క్లో నెలకొల్పిన వాన్గార్డ్ న్యూ ఇండియా ఆఫీస్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భం గా భట్టి మాట్లాడుతూ భారత భవిష్యత్తు నగరంగా తెలంగాణలో ఫ్యూచర్ సిటీ రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్నిరకాల మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఇది నిర్మితమవుతోంది. ఇందులో పెట్టుబడులు పెట్టి, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములవ్వండి అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వచే ఏడాది 120 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ( జీసీసీ)ను ప్రారంభించి, కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం అని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో స్కిలింగ్, రీ స్కిల్లింగ్, ఆప్ స్కిల్లింగ్‌లో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. వాన్గార్డ్ లాంటి ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.







