Shyamala: పోలీసులతో శ్యామల ఏం చెప్పింది?
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని, వైసీపీ ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala) తేల్చిచెప్పారు. బస్సు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో కర్నూలు (Kurnool) తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో 27 మందిపై గత నెల 30న కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిలో పలువురికి నోటీసులు పంపగా వైసీపీ అధికార ప్రతినిధులు ఆరే శ్యామల, కారుమూరి వెంకటరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ప్రతినిధి టి.నాగార్జునరెడ్డి (Nagarjuna Reddy), వైసీపీ అభిమాని నవీన్. సీవీ రెడ్డిలను పోలీసులు విచారించారు.
శ్యామలను గంటన్నరపాటు విచారించారు. ప్రమాదానికి ముందు శివశంకర్ (Shivshankar), అతడి మిత్రుడు ఎర్రిస్వామిలు బెల్టు దుకాణంలోని మద్యం తాగారని ఎవరు చెప్పారు? దానికి తగినా ఆధారాలున్నాయా, ఉంటే చూపాలంటూ పలు ప్రశ్నలు అడిగేసరికి ఆమె నీళ్లు నమిలారు. కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, మహిళా ఎస్సై సమక్షంలో ఆమెను ప్రశ్నించారు. అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేశారని అడగ్గా, వైసీపీ అధికార ప్రతినిధి కావడంతో వారిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే పార్టీ ఆదేశాల మేరకు చదివానని వెల్లడిరచినట్లు తెలిసింది.







