Jogi Ramesh: నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) , ఆయన సోదరుడు రాము (Ramu) లకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు (Police) వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. జైలు అధికారులు రమేష్‌కు ఖైదీ నవంబర్ 7177, రాముకు ఖైదీ నంబర్ 7178 కేటాయించారు. గత నెల ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో వీరిద్దరినీ ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టులో వాదనలు ప్రారంభమై తెల్లవారుజామున 2:20 గంటల వరకు సాగాయి. దీనిపై ఉదయం 5 గంటలకు న్యాయాధికారి లెనిన్‌బాబు ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. నిందితులను నెల్లూరు కేంద్ర కారాగానికి తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వారిని మొదట విజయవాడలోని జిల్లా జైలుకు తీసుకువెళ్లిన అనంతరం నెల్లూరు సెంటర్ జైలుకు తరలించారు.






