Cancer Center: దొనకొండలో రూ.4,260 కోట్లతో.. ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ : పీటర్ చున్
                                    ప్రకాశం జిల్లాల దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4,260 కోట్ల ( 480 మిలియన్ డాలర్ల ) వ్యయంతో చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్‌ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ పీటర్ చున్(Peter Chun) వెల్లడిరచారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం, చల్లా గ్రూప్, ఒమోక్సా బయాలజీస్, మేస్, ఐ హోల్డింగ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్‌ను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడ 9Vijayawada) లోని ఓ హోటలో సమవేశమైన ఆయా సంస్థల ప్రతినిధులు ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. పీటర్ చున్ మాట్లాడుతూ చున్ జియోంగ్ ఉన్న క్యాన్సర్ సెంటర్‌ను చెన్నై (Chennai) లో ప్రారంభించామని, సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. అనుమతులు రాగానే నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. స్మార్ట్ మెడికల్ సిటీ ప్రాజెక్టులో భాగంగా క్యాన్సర్ డయాగ్నసిస్` అంకాలజీ, క్యాన్సర్ చికిత్స` శస్త్రచికిత్సలు, 1500 పడకలతో ఇన్ పేషెంట్ వార్డు, నర్సింగ్ హాస్పిటల్, మెడికల్ స్కూల్, హెలిపోర్ట్, హోటల్, నివాస సముదాయం, రెస్టారెంట్లు, బొటానికల్ గార్డెన్, పార్కు, క్యాన్సర్ మ్యూజియం, ఆరోగ్య సాంకేతిక కేంద్రం తదితరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు. ఈ ప్రాజెక్టుతో 4 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.







