Pakistan: పాక్‌కు షాకిచ్చిన అమెరికా.. నాలుగు సంస్థలపై
బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ పాకిస్థాన్ (Pakistan) కు చెందిన నాలుగు కీలక సంస్థలపై అమెరికా ((America) ఆంక్షలు విధించింది. పాక్ దీర్ఘశ్రేణి క్షిపణి ముప్పు నానాటికి పెరుగుతున్న దృష్ట్యా సామూహిక విధ్వంసక ఆయుధాలను వాటి డెలివరీ మార్గాలను విస్తరిస్తున్న నాలుగు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ ప్రభుత్వ రంగానికి చెందిన అంతరిక్ష, రక్షణ ఏజెన్సీ జాతీయ అభివృద్ధి భవనం (ఎన్డీసీ) ((NDC) తో పాటు మరో మూడు సంస్థలు అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్ప్రైజ్స్లను ఆంక్షల జాబితాలో చేర్చింది. బాలిస్టిక్ కార్యక్రమం కోసం ఓర్డీసీ (ORDC)కి భారీగా పరికరాలను సరఫరా చేసిన కారణంగా అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై, క్షిపణి అభివృద్ధి కోసం అవసరమైన పరికారణాలను ఎన్డీసీ, ఇతరులకు అందిస్తున్న అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్ప్రైజెస్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్(Matthew Miller) వెల్లడించారు.






