Britain: బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆకర్షణీయంగా ఏదైనా వస్తువో లేదా తినబండారమో కనిపిస్తే చాలు పిల్లలు అది కొనివ్వాలని మారాం చేస్తుంటారు. అది ఆరోగ్యానికి మంచిది కాదని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోరు. తాము కోరుకున్నది చేతికి చిక్కేంత వరకు విసిగిస్తూనే ఉంటారు. ఇలా తీసుకునే వాటిలో జంక్ ఫుడ్(Junk Food) మోతాదు ఎక్కువగా ఉంటే చిన్నారులు ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ (Britain) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీలో వచ్చే జంక్ ఫుడ్ యాడ్స్ పగటి వేళ ప్రసారం చేయడంపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 2025 అక్టోబరు నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటన్ (Britain) లో చిన్నారులు ఎక్కువగా ఊబకాయంతో బాదపడుతున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ ( NHS) నివేదికలో వెల్లడించింది.






