Greenland: కార్ట్ లో కెనడా, గ్రీన్ లాండ్, పనామా కెనాల్
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందే వివాదాస్పద ప్రకటనలతో పొరుగు దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే కెనడా, 51వ రాష్ట్రంగా పేర్కొన్న ఆయన.. గ్రీన్లాండ్(Greenland), పనామా కాలువ (panama canal) ను కూడా కొనేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ (Eric Trump) చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూడిరటి కోసం ట్రంప్ ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నట్లుగా ఉన్న ఫొటో అది. ఈ కామర్స్ వెబ్సైట్లో ట్రంప్ వీటిని చూస్తున్నట్లుగా ఉన్న ఫోటోతో పాటు కెనడా, గ్రీన్లాండ్, పనామా కెనాల్‌ను కార్ట్‌లో పెట్టినట్లుగా ఉన్న చిత్రాన్ని ఎరిక్ ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇక వీటిని కొనుగోలు చేయడమే తరువాయి అన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారు. దీనికి మేం మళ్లీ వచ్చేశాం అనే సందేశాన్ని జత చేశారు.






