NASA: నాసా చీఫ్ గా బిలియనీర్
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలకవర్గంలో నియామకాల జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా అగ్రరాజ్య అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తదుపరి చీఫ్ గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్మెన్ (Jared Isaacman) ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపారవేత్త, దాత, పైలట్, వ్యోమగామి అయిన జేర్డ్ ఐజాక్మెన్ ను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అడ్మినిస్ట్రేటర్ గా నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నాయకత్వంలో నాసా మిషన్ మరింత పురోగతి సాధిస్తుంది. స్పేస్ సైన్స్, టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని అని ట్రంప్ పేర్కొన్నారు.






