Trudeau: కెనడా ప్రధాని ట్రూడో కీలక నిర్ణయం
వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాకు కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటూ కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో(Trudeau) కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రత కోసం రక్షణ వ్యయాన్ని 913.05 మిలియన్ డాలర్లకు పెంచుతూ మినీ బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. ఈ నిధులు పబ్లిక్ సేప్టీ కెనడా, కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ, ది కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగాలకు వెళ్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఎగుమతి అయ్యే వస్తువులను తనిఖీ చేసేందుకు కెనడా బోర్డర్ సర్వీసెస్లో సిబ్బంది సంఖ్యను పెంచనున్నట్లు తెలిపింది. ఇందుకోసం కస్టమ్స్ చట్టానికి సవరణలు చేయనున్నట్లు తెలిపింది.






