Japan: జపాన్ పర్యటనకు ముగ్గురు తెలంగాణ విద్యార్థులు ఎంపిక

జాతీయ స్థాయి సైన్స్ పరిశోధనల్లో సత్తా చాటిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు (Telangana students) జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో మొత్తం 54 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో నారాయణపేట గురుకుల పాఠశాల విద్యార్థి ఏ.శివారెడ్డి (Shiva Reddy), మంచిర్యాల జిల్లా శ్రీచైతన్య పాఠశాల విద్యార్థిని సాయి శ్రీవల్లి (Sai Srivalli), కరీంనగర్ జిల్లా పరమిత హేరిటేజ్ స్కూల్ విద్యార్థిని శుభశ్రీ సాహు (Subhasree Sahu) ఉన్నారు. వీరు ఈ నెల 15 నుంచి 21 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. భారత్‌లోని యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎజెన్సీ ( జెఎస్‌టీ) ఈ కార్యక్రమాన్ని 2016 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ నుంచి 21 మంది విద్యార్థులు జపాన్‌లో పర్యటించారని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ( ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకులు జి.రమేశ్ (Ramesh) తెలిపారు.