America: అమెరికా పాఠశాలలో కాల్పులు… ముగ్గురి మృతి
అమెరికాలోని విస్కాన్సిన్ (Wisconsin) లో ఓ క్రైస్తవ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నాడని పోలీసుల (Police) అధికారులు తెలిపారు. ఆ పాఠశాలకు దారితీసే మార్గాలను పోలీసులు మూసివేశారు. వివిధ విభాగాల అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తులో సహకరిస్తున్నారు. పూర్వ పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు దాదాపు 390 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అమెరికా (America )లో ఈ ఏడాది ఇప్పటి వరకు పాఠశాలలో కాల్పుల ఘటనలు 322 చోటు చేసుకున్నాయి.






