Sunita Williams: వచ్చే ఏడాది సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత`అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది స్పేస్ వాక్ (Space Walk) చేయబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించారు. ఐఎస్ఎస్ (ISS) నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో వివాహరించడమే స్పేస్‌వాక్. సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి ఈ ఏడాది జూన్‌లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారం తర్వాత వెనక్కి రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో సాధ్యపడలేదు.






