Sunil Gavaskar: సిరాజ్ కాస్త తగ్గించుకో, హెచ్చరించిన గవాస్కర్
అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 2వ రోజు సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (Travis head) కి మహమ్మద్ సిరాజ్ ఇచ్చిన సెండ్ ఆఫ్ వివాదాస్పదం అయింది. అది అసలు అనవసరం అంటూ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత్ (India) ను హెడ్ తన దూకుడైన బ్యాటింగ్ తో ఇబ్బంది పెట్టాడు. ఓ రకంగా వన్డే మ్యాచ్ ఆడాడు. దాదాపు వంద స్ట్రైక్ రేట్ తో 140 పరుగులు చేసాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి హెడ్ సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
అవుట్ అయి వెళ్ళే సమయంలో… హెడ్ ను ఉద్దేశించి కొన్ని మాటలు అనగా… హెడ్ కూడా తిరిగి ఇచ్చేసాడు. అయితే తాను వెల్ బౌలింగ్ అని అన్నానని సిరాజ్ (siraj) కు అది అర్ధం కాలేదన్నాడు. ఈ ఘటన తర్వాత మైదానంలోని అంపైర్లు సిరాజ్ ను కాస్త సున్నితంగా హెచ్చరించారు. ఆ తర్వాత సిరాజ్ పై విరుచుకుపడిన సునీల్ గవాస్కర్‌కి ఈ సంఘటన మింగుడుపడలేదు. అసలు అది అనవసరం అన్నాడు. అతను 140 పరుగులు చేసాడు. అతనేం నాలుగైదు పరుగులు చేసి అవుట్ కాలేదు.
ట్రావిస్ హెడ్ లోకల్ హీరో… సెంచరీ చేసిన తర్వాత సిరాజ్ అతన్ని అభినందించి ఉంటే ప్రేక్షకులకు హీరో అయ్యేవాడు… కాని సిరాజ్ అనవసరంగా ఆవేశ పడ్డాడని గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఇక హెడ్ ఆట తీరు భారత్ ను రెండో టెస్ట్ లో కష్టాల్లో పడేసింది. తన సహజ ఆట తీరుతో… హెడ్ తన ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో భారత్‌పై తన ఎనిమిదో టెస్ట్ సెంచరీ నమోదు చేసాడు. భారత్ పై రెండవ సెంచరీని సాధించాడు. అతని ఇన్నింగ్స్ కారణంగానే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేయగలిగింది. భారత్‌పై 157 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.






