Ashwin: అప్పుడు ధోని, ఇప్పుడు అశ్విన్ ఇది కరెక్ట్ కాదన్న గవాస్కర్
భారత మాజీ కెప్టెన్ మరియు దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్… స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) రిటైర్మెంట్ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 2014-15 అస్ట్రేలియా సిరీస్‌లో ధోనీ చేసినట్లే… అశ్విన్ చేసాడన్నాడు గవాస్కర్. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గబ్బా టెస్టు డ్రా అయిన వెంటనే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ధోని (Ms Dhoni) కూడా సీరీస్ మధ్యలోనే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇటువంటి నిర్ణయాలు జట్టు ప్లాన్ ను ఇబ్బంది పెడతాయని అన్నాడు.
సిరీస్ ముగిసిన తర్వాత చెప్పాలని… లేదంటే సీరీస్ ముందు చెప్పాలని… ఇలా మధ్యలో చెప్పడం కరెక్ట్ కాదన్నాడు గవాస్కర్. సెలక్షన్ కమిటీ ఒక ఉద్దేశ్యంతో పర్యటన కోసం చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేసిందని, అశ్విన్ జట్టులో కీలకమని చెప్పుకొచ్చాడు గవాస్కర్. ఇక సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని… మెల్బోర్న్ పిచ్ పై అసలు ఏ అంచనాలు లేవని… మధ్యలో అశ్విన్ ఇచ్చిన షాక్ తో టీం ఇబ్బంది పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లకు అవకాశం దొరుకుతుంది అని కూడా చెప్పుకొచ్చాడు.
అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేస్తున్నారా అని విలేఖర్లు అడగగా… కచ్చితంగా అని సమాధానం ఇచ్చాడు. సుందర్ ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. మెల్బోర్న్, సిడ్నీ టెస్ట్ లు స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలో జడేజాతో పాటుగా మరో స్పిన్నర్ ను తీసుకోనున్నారు. ఇక అశ్విన్ రిటైర్ కావడంతో కుల్దీప్ యాదవ్ ను ఆస్ట్రేలియా పిలిచే అవకాశం ఉండవచ్చు. మరో యువ ఆటగాడు అర్షదీప్ సింగ్ కు కూడా అవకాశం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.






