South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు అనూహ్య నిర్ణయం
అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి కిమ్ యోంగ్ యూన్ (Kim Yong Yoon)ను పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ సైనికాధికారి చోయ్ యుంగ్ యూక్ (Choi Yung Yook)ను నియమించారు. మార్షల్ లా విధించి, సైన్యాన్ని వీధుల్లో దింపినందుకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్తో పాటు రక్షణ మంత్రి కిమ్ యోంగ్ యూన్పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అభిశంసన తీర్మానంపై శుక్రవారం లేదా శనివారం ఓటింగ్ జరుగనుంది. 72 గంటల్లోగా పార్లమెంట్లో ఓటింగ్ జరగకపోతే తీర్మానం రద్దవుతుంది.






