California :కాలిఫోర్నియాలో కూలిన విమానం
వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం జరిగింది. డిస్నీల్యాండ్కు సమీపంలోని ఆరెంజ్ కౌంటీ (Orange County ) లో ఉన్న ఫుల్లర్టన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నిమిషంలోనే విమానం కుప్పకూలింది. ఓ వాణిజ్య భవనం పైకప్పుపై పడిరది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2:09 గంటలకు ఈ ఘటన జరిగింది. సింగిల్ ఇంజన్ కలిగిన నాలుగు సీట్ల చిన్న విమానమే అయినప్పటికీ, ఫర్నీచర్ గోదామ్పై కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానం కూలగానే గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు(Police), అగ్నిమాపక సిబ్బంది (Firefighters ) వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి సమీప భవనాలను ఖాళీ చేయించారు. గతేడాది నవంబవర్లో మరో చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండిరగ్ చేస్తుండగా విమానాశ్రయానికి అర మైలు దూరంలో ఉన్న చెట్లును ఢీకొట్టింది. విమానంలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.






