Russias: ఉక్రెయిన్ తో యుద్ధం అంతతేలిగ్గా ఆగదు : రష్యా విదేశాంగ మంత్రి
ఉక్రెయిన్‌తో యుద్ధం తేలిగ్గా ఆపేదిలేదని రష్యా (Russia ) విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ (Sergey Lavrov) తేల్చిచెప్పారు. రష్యా, పొరుగు దేశాల్లో సుదీర్ఘకాలం శాంతి నెలకొనేలా చట్టబద్ధమైన ఒప్పందాన్ని మాస్కో (Moscow) కోరుకుంటోందని పేర్కొన్నారు. ఇప్పట్లో సంధికి మార్గాలు కనిపించడంలేదన్నారు. ఒక వేళ బలహీనమైన ఒప్పందం చేసుకొంటే పశ్చిమ దేశాలు మళ్లీ ఉక్రెయిన్ (Ukraine) కు ఆయుధ సరఫరా చేసి బలోపేతం చేస్తామని రష్యా అనుమానిస్తున్నట్లు తెలిపారు. రష్యా భద్రతకు హామీ ఇచ్చే షరతులున్న చట్టపరమైన ఒప్పందం మాకు అవసరం. ఆ సంధిని ఉల్లంఘించలేని విధంగా దానిని తరాయు చేయాలి. అదే సమయంలో మా పొరుగు దేశాల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని లావ్రోవ్ పేర్కొన్నారు.






