Rohith Sharma: ప్రాక్టీస్ ట్రెండ్ మార్చిన రోహిత్, సెంచరీ చేస్తాడా…?
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో టెస్ట్ లో రాణించకపోతే మాత్రం ఖచ్చితంగా అతనిపై అభిమానులే మండిపడే పరిస్థితి ఉంటుంది. గతంలో రోహిత్ శర్మ (Rohith Sharma) ప్రదర్శనను చూసి అతన్ని వెనకేసుకొచ్చే వాళ్లు కూడా రాబోయే రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ ఆడకపోతే మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అతన్ని కెప్టెన్ గా రాజీనామా చేయాలని జట్టు నుంచి తప్పుకోవాలని రిటైర్ అయ్యే ఆలోచన చేయాలని… అవసరమైతే వన్డేల్లో జట్టులో కొనసాగాలని టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకుంటే మంచిది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
దీనితో రోహిత్ శర్మ కూడా కాస్త ఒత్తిడిలోనే కనపడుతున్నాడు. దీనితో ఎలాగైనా సరే మెల్బోర్న్ లో జరగబోయే నాలుగో టెస్ట్ లో రాణించాలని పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకోసం రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్లతో నెట్స్ లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఇక ప్రాక్టీస్ లో బ్యాట్ కంటే కూడా బేస్బాల్ బ్యాట్ అలాగే స్టంప్ ను వినియోగిస్తున్నాడు రోహిత్ శర్మ. దీని ద్వారా డిఫెన్స్ ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ ఫ్యాట్ కమీన్స్ నుంచి రోహిత్ శర్మ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
దీనితో అతన్ని ఎదుర్కొనేందుకు హర్షిత్ రానా (Harshith Rana) అలాగే బూమ్రాలతో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. స్పిన్ బౌలింగ్ సమర్థవంతంగా ఆడే రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలింగ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తడబడుతున్నాడు. దానికి తోడు ఓవర్సీస్ పిచ్ లపై రోహిత్ శర్మ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మైదానాల్లో రోహిత్ శర్మ గతంలో కూడా పలుమార్లు తడబడ్డాడు. ఇక ఈ సిరీస్ లో రెండు టెస్టులాడిన రోహిత్ శర్మ రెండు టెస్టుల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. మరి నాలుగో టెస్ట్ లో అయినా రాణించి అంచనాలను అందుకుంటాడా అనేది చూడాలి.






