Rohith Sharma: నేను గుడ్ బై చెప్పను.. రెస్ట్ అంతే..!
మిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పే ఆలోచనలో లేడు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు టెస్టుల్లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకోవాలని, యువకులకు అవకాశం కల్పించాలని భారత క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తూ వచ్చారు. రెండో టెస్టులో రాణించకపోయినా కనీసం మూడు, నాలుగో టెస్ట్ లలో అయినా సరే రోహిత్ శర్మ రాణించే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేశారు.
కానీ నాలుగో టెస్ట్ లో కీలక సమయంలో కూడా రోహిత్ శర్మ వికెట్ పారేసుకోవడంపై ఇప్పుడు తీవ్ర చర్చే జరుగుతుంది. అయితే ఐదో టెస్టుకి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్ భారీగా క్రికెట్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో లేడని, ప్రస్తుతం విమర్శలకు దూరంగా ఉండేందుకు రెడీ అవుతున్నాడని, అందుకే ఆఖరి టెస్టును ఆడకుండా తప్పుకుంటున్నాడని తెలుస్తోంది. వచ్చేయేడాది ఇంగ్లాండ్ పర్యటనతో పాటుగా భారత్ లో కూడా టెస్ట్ సిరీస్ లు ఉన్నాయి.
అందుకే రోహిత్ శర్మ కాస్త ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో గిల్ తుది జట్టులో చేరనున్నాడు. అటు సీనియర్ ఆటగాడు రిషబ్ పంతు(Rishabh Pant)ను కూడా పక్కన పెట్టే ఆలోచనలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఉన్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో కూడా ప్రసిద్ కృష్ణ తుదిజట్టులో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. బౌలర్ ఆకాశ్ దీప్ నడుం నొప్పి కారణంగా చివరి టెస్ట్ కు దూరం అయ్యాడు.






