Rahul Dravid: మళ్ళీ కోచ్ చైర్ లో ద్రావిడ్…? గంభీర్ కు డెడ్ లైన్..!
టీమిండియా హెడ్ కోచ్ గా మళ్లీ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. టి20 ప్రపంచ కప్ తర్వాత ద్రావిడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆటగాళ్లు విజ్ఞప్తి చేసినా సరే కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ ఆసక్తి చూపించలేదు. అయితే ప్రస్తుతం మళ్ళీ భారత జట్టుకు ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించే సూచనలు కనపడుతున్నాయి. ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) విఫలం కావడంతో ద్రావిడ్ మళ్ళీ బాధ్యతలు చేపట్టాలని ఆటగాళ్లు కూడా కోరుతున్నారు.
డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం అంతా అనుకూలంగా లేదని… ఆస్ట్రేలియా తో జరిగిన గత మూడు టెస్టుల్లో టీమిండియా విఫలం కావడం పట్ల ఆటగాళ్లు కూడా ఇప్పుడు గంభీర్ పై కాస్త సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల విషయంలో గంభీర్ ఫోకస్ చేయడం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma)కు గంభీర్ కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆటగాళ్ల మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడుతుంది.
ఆస్ట్రేలియాతో జరిగే సీరిస్ ఓడిపోతే మాత్రం కచ్చితంగా గంభీర్ పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. చాంపియన్ ట్రోఫీ కోసం వివిఎస్ లక్ష్మణ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించి ఆ తర్వాత మళ్లీ ద్రావిడ్ ను పూర్తిస్థాయి కోచ్ గా తీసుకురావాలని బీసీసీ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధానంగా గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల సహజ ఆటను మార్చుకోవాలని.. సూచనలు సలహాలు ఇచ్చాడని దీనితో దూకుడుగా ఆడాల్సిన టీం ఆత్మ రక్షణలో పడిపోయిన పరిస్థితి ఏర్పడిందని… ఇక కెప్టెన్ తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఎక్కువగా జోక్యం చేసుకుంటూ.. తుది జట్టులో ఎవరు ఉండాలి అనేది తానే ఫైనల్ చేస్తున్నాడని ఆరోపణలు వినపడుతున్నాయి.






