Putin: భారత్ లో ఏర్పాటుకు రష్యా సిద్ధం : పుతిన్
భారత ప్రభుత్వం చిన్న, మధ్య తరహా, సంస్థలకు (ఎస్ఎమ్ఈలు) వ్యాపారానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నందుకు ప్రధాని మోదీ (Modi) ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. భారత్‌లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు రష్యా (Russia) సిద్ధంగా ఉందని తెలిపారు.భారత్‌లో పెట్టుబడులూ లాభదాయకంగా ఉన్నాయని మాస్కో (Moscow) లో జరిగిన 15వ వీటీవీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో పుతిన్ తెలిపారు. దిగుమతుల ప్రత్యామ్నాయ కార్యక్రమం కింద రష్యా విపణి నుంచి వైదొలిగిన పాశ్చాత్య బ్రాండ్ల స్థానంలో రష్యాకు చెందిన కొత్త బ్రాండ్లు వచ్చాయని తెలిపారు.
వినియోగ వస్తువుల విభాగంలోనే కాకుండా ఐటీ, హైటెక్, వ్యవసాయం లాంటి రంగాల్లోనూ స్థానిక రష్యా సంస్థలు విజయవంతం అయ్యాయని ఆయన ప్రస్తావించారు. రష్యా చేపట్టిన దిగుమతి ప్రత్యామ్నాయ కార్యక్రమం కూడా భారత్‌లో తయారీ కార్యక్రమం లాంటిదేనని తెలిపారు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే విధానాలపై ఆ దేశ నాయకత్వం దృష్టి సారిస్తోందన్నారు. భారత్‌లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. రష్యా ఫెడరేషన్లో దిగ్గజ చమురు ఉత్పత్తి సంస్థ రోస్నెఫ్ట్ భారత్‌లో ఇప్పటికే 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టిందని పుతిన్ తెలిపారు.






