Taiwan: 24 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి
తైవాన్ తో సంబంధాలు తెంచుకోవాలని తమకు సూచించిన చైనా దౌత్యవేత్త షు వీపై పరాగ్వే మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ అగ్గిమీద గుగ్గిలమైంది. 24 గంటల్లోగా తమ దేశం విడిచి వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. లాటిన్ అమెరికాకు చైనా (china) సీనియర్ దౌత్యవేత్తగా ఉన్న షు యునెస్కో సమావేశంలో పాల్గొనేందుకుగాను పరాగ్వేకు వెళ్లారు. రాజధాని నగరం అసూన్సియాన్ (Asuncion) లో ఆ దేశ చట్ట సభ్యులతో మాట్లాడుతూ తైవాన్‌తో బంధం తెంచుకోవాలని సూచించిన సంగతి గమనార్హం. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 దేశాలు తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. వాటిలో పరాగ్వే ఒకటి. దక్షిణ అమెరికాలో ఈ ఒక్కటే తైవాన్(Taiwan) ను దేశంగా గుర్తించింది.






