Jose Raul Mulin: ఈ అంశంపై ట్రంప్ తో చర్చించాల్సిన అవసరం లేదు : జోస్ రౌల్ ములినో
మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవల గ్రీన్లాండ్, పనామా కాలువ(panama canal) ను కొనేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో(Jose Raul Mulino) స్పందించారు. ఈ అంశంపై ట్రంప్(Trump) తో చర్చించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలువ పనామేనియన్లకు చెందింది. ఈ వాస్తవికతపై ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదు అని ములినో(Mulino) పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందనే ట్రంప్ ఆరోపణలను ఆయన ఖండిరచారు.






