Panama: పనామా జోలికోస్తే ఊరుకోం!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వారం రోజులుగా వెలువరిస్తున్న క్రిస్మస్ సందేశాల్లో కెనడా, పనామా కెనాల్, గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా కలుపుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనలను ముందుకు తెచ్చారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఈ సందేశాలను వరుసగా పోస్ట్ చేస్తూ, పనామా కెనాల్ (Panama Canal )ను స్వాధీనం చేసుకోవడం గురించి ప్రస్తావించారు. పనామా వసూలు చేస్తున్న సుంకాలు హాస్యాస్పదంగా ఉన్నాయని, జనవరి 1 నుంచి ఈ చార్జీలు పెంచితే పనామా కాలువ తప్పు చేతుల్లోకి పడుతోందని, ఇలా అయితే పనామా కాల్వను తమ అధీనంలోకి తెచ్చుకుంటామని బెదిరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై పనామా, వెనిజులా (Venezuela )తదితర లాటిన్ అమెరికన్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.






