Russia: ఆయనకు రాజకీయ ఆశ్రయం కల్పించాం : రష్యా
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించినట్లు రష్యా (Russia) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నిర్ణయానికి అధ్యక్షుడు పుతిన్ (Putin) వ్యక్తిగతంగా ఆమోదం తెలిపినట్లు క్రెమ్లిన్ పేర్కొంది. తిరుగుబాటుదళాల ఆక్రమణతో సిరియాను వీడిన అసద్, రష్యాకు పలాయనమయ్యాడన్న వార్తల నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది. అసద్ ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఉన్నాడనే విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం వెల్లడిరచలేదు. అయితే, పుతిన్ అసద్‌ల మధ్య మాత్రం ఎటువంటి భేటీ జరగలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొనారు. ఆయన ఆచూకి గురించి చెప్పడానికి ఏమీ లేదన్న ఆయన, దేశాధినేత అనుమతి లేకుండా ఇటువంటి విషయాలు వెల్లడిరచలేమన్నారు. ఇది అధ్యక్షుడి నిర్ణయమేనని తెలిపారు.






