America: అమెరికా ప్రజలకు యుద్ద భయం.. వాటికి భలే గిరాకీ
అమెరికా ప్రజలను మూడో ప్రపంచ యుద్ధం భయపెడుతున్నది. దీంతో అణు యుద్ధం (Nuclear war) వచ్చినా సురక్షితంగా ప్రాణాలను రక్షించే బంకర్లకు డిమాండ్ పెరిగిపోతున్నది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధం, అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని రష్యా చేస్తున్న ప్రకటన, మరో వైపు ఉత్తర కొరియా, చైనా (North Korea, China) దేశాలు అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవడం, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఈ అన్ని కారణాలు అమెరికా వాసులను బంకర్ల కొనుగోలుకు ప్రేరేపిస్తున్నాయి. దీంతో చాలా అమెరికా కుటుంబాల అణు బంకర్లను కొనుగోలు చేస్తున్నాయి. వీటిని సుమారు 50,000 డాలర్ల వరకు పెట్టి కొంటున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా గత ఏడాది వీటి అమ్మకాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలిసింది.






