Norway : అలాంటి వ్యక్తి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మంచి కాదు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వివిధ దేశాల రాజకీయాల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా బ్రిటన్ రాజకీయాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నార్వే ప్రధాని జోనాస్ (Jonas) కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎలాన్ మస్క్ అమెరికా బయటి దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తన సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగించుకునే సౌలభ్యం మస్క్‌కు ఉంది. ఆయన దగ్గర ఆర్థికవనరులు భారీ స్థాయిలో ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచి పరిణామం కాదు అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నార్వే రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటే అన్ని పక్షాలకు చెందిన నాయకులంతా కలిసికట్టుగా ఆయన ప్రయత్నాలకు దూరంగా ఉండాలన్నారు.






