New Jersey: న్యూజెర్సీలో కలకలం.. ఆకాశంలో
అమెరికాలోని న్యూజెర్సీలో పలు చోట్ల రాత్రివేళ ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవి యూఎఫ్వో (గుర్తుతెలియని ఎగిరే వస్తువులు) తరహా డ్రోన్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. నివాస భవనాల మీదుగా ఎగురుతున్న వీటి దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. న్యూజెర్సీ (New Jersey)లో దాదాపు పది ప్రాంతాల్లో ఇలా వస్తువులు ఎగరడాన్ని స్థానికులు గుర్తించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నకు సంబంధించిన భవనాల సమీపంలోనూ ఇలాంటి డ్రోన్లు కనిపించడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషను స్పందించింది. ఆ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. న్యూజెర్సీ ఘటనలపై స్పందించిన గవర్నర్ ఫిల్ మర్ఫీ (Phil Murphy) అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదన్నారు.






