యుద్ధరంగాన్ని వీడి..? గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ప్రస్థానం…?
పశ్చిమాసియాలో ఇరాన్ తో యుద్ధం నేపథ్యంలో అమెరికా మోహరించిన అతిపెద్ద విమానవాహక నౌకల్లో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఒకటి. ఇది కొన్ని నెలలకుగా యుద్ధక్షేత్రంలో కీలక పాత్ర పోషించింది. పది నెలలకు పైగా సుదీర్ఘ మోహరింపు తర్వాత ఈ నౌకను వెనక్కు పిలిపించారు. ప్రస్తుతం ఈ క్యారియర్ యూఎస్ యూరోపియన్ కమాండ్ (EUCOM) పరిధిలోకి చేరినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
గెరాల్డ్ ఫోర్డ్ వెనుదిరగడంతో పశ్చిమాసియాలో అమెరికా విమాన వాహకనౌకల సంఖ్య మూడు నుంచి రెండుకు తగ్గింది. ప్రస్తుతం యూఎస్ఎస్ అబ్రహం లింకన్(abraham lincoln), యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్(George bush) క్యారియర్లతో పాటు మొత్తం 20 అమెరికా నౌకాదళ నౌకలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వియత్నాం యుద్ధం తర్వాత అత్యంత సుదీర్ఘకాలం మోహరించిన అమెరికా క్యారియర్‌గా గెరాల్డ్ ఫోర్డ్ నిలిచింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నౌకలో పలు సమస్యలు తలెత్తాయి. మార్చి 12న నౌకలోని లాండ్రీ గదిలో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు సిబ్బంది గాయపడగా, సుమారు 100 పడకలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు నౌకలోని టాయిలెట్ వ్యవస్థలో కూడా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ మరమ్మతులు, సిబ్బందికి విశ్రాంతి అవసరమైనందున గెరాల్డ్ ఫోర్డ్‌ను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. ఈ నౌక మే మధ్య నాటికి వర్జీనియాలోని తన హోం పోర్టుకు తిరిగి చేరుకోనుంది.
ఇవి కూడా చదవండి






