Bhumra: భారత్ ను కంగారు పెట్టిన బూమ్రా, మోర్కెల్ ఏం అన్నాడు…?
టీం ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా కాసేపు భారత అభిమానులను కంగారు పెట్టాడు. ఈ సీరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్న బూమ్రా… గాయపడ్డాడు అనే భయం కాసేపు భారత శిభిరాన్ని వెంటాడింది. శనివారం అడిలైడ్ ఓవల్, అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బౌలింగ్ చేస్తున్న బూమ్రా (Jasprit bhumra) కాసేపు ఇబ్బంది పడ్డాడు. అనంతరం ఫిజియో వచ్చి బూమ్రాకు వైద్య సదుపాయం అందించాడు. కాలి గాయంతో అతను ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది. దీనిపై భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ క్లారిటీ ఇచ్చాడు.
అది కేవలమం తిమ్మిరి మాత్రమే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆ తర్వాత కూడా, అతను బౌలింగ్ చేశాడని… రెండు వికెట్లు తీసాడు. కాబట్టి అతని గురించి ఆందోళన అవసరం లేదు అన్నాడు. రాబోయే టెస్టుల్లో బూమ్రా కీలకం కాబట్టి అతన్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాపై భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది అంటే బూమ్రా పుణ్యమే. ఈ దశలో బూమ్రా గాయపడితే అది భారత్ కు కచ్చితంగా ఇబ్బందికరమే. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ లు తీసాడు.
ఇక రెండో టెస్ట్ లో భారత్ కష్టాల్లో పడింది. మరోసారి పింక్ బాల్ ఫోబియాతో ఇబ్బంది పడింది. రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయంలో భారత్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ (Virat kohli), రోహిత్ శర్మ (Rohith Sharma) మరోసారి నిరాశపరిచారు. అడిలైడ్ మైదానంలో మంచి అనుభవం ఉన్న కోహ్లీ కూడా ఈసారి ఫెయిల్ అయ్యాడు. కెఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్ లో పర్వాలేధనిపించినా రెండో ఇన్నింగ్స్ లో చేతులు ఎత్తేశాడు. గిల్, జైస్వాల్ కాస్త నిలబడినా కీలక సమయంలో వికెట్ లు సమర్పించుకున్నారు.






