BGT: మరో మంకీ గేట్ వివాదం, నోరు జారినకామెంటేటర్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో వివాదం రేగింది. ఇంగ్లీష్ కామెంటేటర్ ఇషా గుహా (Isa Guha) టీం ఇండియా స్టార్ ఆటగాడు బూమ్రా (Jasprit Bumrah) లక్ష్యంగా చేసిన ఓ కామెంట్ వివాదాస్పదం అయింది. అతనిని ప్రైమేట్ అంటూ ఓ పదం వాడింది ఇషా గుహా. ఇసా గుహా… ఇంగ్లండ్ మాజీ క్రికెటర్. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కామెంటేటర్ గా అడుగు పెట్టింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా అవుట్ అయిన తర్వాత, ఆస్ట్రేలియా పేస్ లెజెండ్ బ్రెట్ లీ బుమ్రా బౌలింగ్‌ను ప్రశంసించాడు.
అతని ప్రదర్శనపై లీ తన ఆలోచనలను అక్కడే షేర్ చేసుకున్నాడు. బుమ్రా, ఈ రోజు, ఐదు ఓవర్లు బౌలింగ్ చేసాడు. ఈ అయిదు ఓవర్లల్లో 2 నుంచి 4 వికెట్లు అతని నుంచి భారత్ కోరుకుంది ఇదే అంటూ కామెంట్ చేసాడు. దీని గురించి ఇషా మాట్లాడుతూ “అత్యంత విలువైన ప్రైమేట్” అని కామెంట్స్ చేసింది. వాస్తవానికి ప్రైమేట్ అంటే కోతి లేదా వానరం అనే అర్ధం వస్తుంది. ఇక దీనిపై వివాదం రేగడంతో ఇషా అక్కడే క్షమాపణలు చెప్పింది. తాను బూమ్రా గొప్పతనం గురించి చెప్పడానికి ఆ మాట వాడా అని అది సరిగా అర్ధం కాలేదని పేర్కొంది.
తప్పు పదాన్ని ఎంచుకుని తప్పు చేశా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దక్షిణాసియాకు చెందిన వ్యక్తిగా భావిస్తారు అనుకున్నాను అని కాని ఇలా అర్ధం చేసుకుంటారు అనుకోలేదని క్షమాపణ చెప్పింది. ఆమె క్షమాపణలు చెప్పదాన్న్ని రవిశాస్త్రి కూడా స్వాగతించారు. ఆమె ధైర్యంగా క్షమాపణ చెప్పిందని ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది అంటూ శాస్త్రి తన అభిప్రాయం చెప్పాడు. 2008 లో ఇలాగే మంకీ గేటు వివాదం తీవ్ర దుమారం రేపింది. ఆండ్రూ సైమండ్స్, హర్భజన్ సింగ్ ల మధ్య ఆ వివాదం ప్రపంచ క్రికెట్ ను కుదిపేసింది.






