Indian student: భారతీయ విద్యార్థి హత్య
కెనడాలో ఒంటారియా ప్రావిన్స్‌లో 22 ఏళ్ల భారతీయ విద్యార్థిని రూమ్మేటే కత్తితో పొడిచి హత్యచేశాడు. సర్నియాలోని లాంబ్టన్ కళాశాలలో మొదటి సంవత్సరం బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న గురాసిస్ సింగ్ (Gurassis Singh) కు అతని గతిలో ఉండే క్రాస్లీ హంటర్‌తో ఏదో విషయమై వివాదం మొదలైంది. అనంతరం ఇద్దరూ వంటగదిలో బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో హంటర్ (Hunter) కత్తి తీసుకొని గురాసిస్ సింగ్‌ను పలుమార్లు పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు (police) ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.






