BGT: పింక్ బాల్ టెస్ట్ కు వరుణుడి అడ్డంకి…? పేసర్లకు స్వర్గమే..
శుక్రవారం నుంచి మొదలుకానున్న రెండో టెస్ట్ పై క్రికెట్ అభిమానుల్లో క్రేజ్ పీక్స్ లో ఉంది. అడిలైడ్‌లో జరగబోయే డే-నైట్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పింక్ బాల్ టెస్ట్ కు, రెడ్ బాల్ టెస్ట్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో భారత్ (India) ఎంత వరకు రాణిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. న్యూజిలాండ్‌పై క్లీన్ స్వీప్ తర్వాత భారత్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. కీలక ఆటగాళ్ళు ఇద్దరు దూరమైనా భారత్ అంచనాలకు మించి రాణించింది. జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (KL Rahul), విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు.
ఇప్పటి వరకు భారత్ 4 డే అండ్ నైట్ టెస్ట్ లు మాత్రమే ఆడింది. అందులో ఒక టెస్ట్ ఓడిపోయింది. 2020 లో జరిగిన అడిలైడ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఓటమి చవి చూసింది. దీనితో భారత్ జట్టు ఎంత వరకు రాణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పింక్ బాల్ టెస్ట్ లో భారత్ తరుపున కోహ్లీ ఒకడే ఇప్పటి వరకు సెంచరీ చేసాడు. డే అండ్ నైట్ టెస్ట్ లో ఎక్కువ వికెట్ లు తీసింది సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్. దీనితో తుది జట్టులో అశ్విన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఇక అక్కడి వాతావరణం విషయానికి వస్తే… దక్షిణ ఆస్ట్రేలియాలో హోరిజోన్లో ఉదయం తేలికపాటి వర్షం కురుస్తోంది. అయితే రోజు గడుస్తున్న కొద్దీ వర్షం అంతగా కురిసే అవకాశం లేదు. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సూర్యుడి ప్రభావం కూడా ఉండవచ్చు. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం ఆటగాళ్లను ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. రోజంతా ఉష్ణోగ్రతలు 23 మరియు 32 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఇది పేసర్లకు అనుకూలంగా మారనుంది.






