UN: యూఎన్ లో తీర్మానం.. అనుకూలంగా భారత్ ఓటు
1967 నుంచి తూర్పు జెరూసలెంతో సహా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ (Israel) వైదొలగాలంటూ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టి తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా భారత్ (India) తో సహా 157 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా సహా ఎనిమిది దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని భారత్ తన ఓటు ద్వారా పునరుద్ఘాటించింది. ఇదిలా ఉండగా సిరియా (Syria)కు చెందిన గోలన్ హైట్స్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలన్న మరో తీర్మానానికి కూడా భారత్ మద్దతు పలికింది.






