India: భారత్-అమెరికా రక్షణ సంబంధాలు బలోపేతం
భారత్(India) – అమెరికా(USA) రక్షణ సంబంధాలు అద్భుతమైన మార్గాల్లో ముందుకు సాగుతున్నాయని పెంటగాన్ (Pentagon ) తెలిపింది. ఈ మేరకు ఇండో పసిఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ (Ely Ratner) పేర్కొన్నారు. అమెరికా -భారత్ ల మధ్య మంచి రక్షణ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇది రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యచరణ సహకారానికి సంబంధించింది. ఇది అద్భుతమైన, ఉత్తేజకరమైన మర్గాల్లో వేగంగా పురోగమిస్తోంది అని తెలిపారు. ఇటీవల 31 ఎంక్యూ -9 ప్రీడేటర్ డ్రోన్లను తక్కువ మొత్తంలో అందించేందుకు అమెరికా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఈ ఏడాది ఇరుదేశాల మధ్య పలు రక్షణ పరికరాల సరఫరాకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి.






