Pentagon : ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం: పెంటగాన్ కార్యదర్శి
భారత్- అమెరికాల మధ్య రక్షణ సహకారం అత్యంత ఉత్సాహవంతమైన మార్గంలో మరింత ముందుకు సాగుతోందని పెంటగాన్ పేర్కొంది. అమెరికా అధికార పగ్గాలు జో బైడెన్ (Joe Biden) నుంచి డొనాల్డ్ ట్రంప్‌కు బదిలీ అవుతున్న దశలో ఈ ప్రకటన వెలువడింది. భారత్ అమెరికా (India America) రక్షణ బంధం ప్రత్యేకమైనది. ఈ అనుబంధం మరింతగా ముందుకు సాగుతూ రక్షణ పారిశ్రామిక సహకారం నుంచి క్షేత్రస్థాయి కార్యాచరణ వరకూ బహుముఖంగా విస్తరిస్తోంది అని అమెరికా రక్షణ శాఖలో ఇండో పసిఫిక్ రక్షణ వ్యవహారాల సహాయ కార్యదర్శి ఎలీ రాట్నర్ (Ely Ratner) అన్నారు. అమెరికా భారత్‌కు ప్రధాన రక్షణ భాగస్వామి స్థాయి కల్పించింది. ఇరుదేశాలూ ఈ సంవత్సరం రక్షణ ఉపకరణాల సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నాయి కూడా.






