Canada :భారత్ మరోసారి ఆందోళన.. కెనడా మీదుగా అమెరికాకు
కెనడా మీదుగా అమెరికాకు భారతీయుల( Indians)ను అక్రమంగా తరలించడం ఇటీవల పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఇలా తమ దేశస్థులను కెనడా (Canada) మీదుగా అక్రమంగా పంపిస్తుండటంపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణాపై గడిచిన రెండేళ్లలో కెనడా దృష్టికి భారత్ పలుమార్లు తీసుకెళ్లింది. గుజరాత్ (Gujarat )కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న సమయంలో తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా 2022 జనవరిలో మరణించిన విషయం తెలిసిందే.






