BGT: డ్రా అయితే ఆ ఇద్దరి పుణ్యమే,చాన్నాళ్ళకు లోయర్ ఆర్డర్ విందు
ఎప్పుడో భారత్ (India) కు టెస్ట్ క్రికెట్ లో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ బలంగా ఉండేది అని వినే వాళ్ళం. కుంబ్లే, హర్బజన్, అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్ ఇలా కొందరు ఆటగాళ్ళు ప్రత్యర్ధులకు కొన్ని సందర్భాల్లో పరీక్ష పెట్టేవారు. అయితే గత అయిదేళ్ళ నుంచి లోయర్ ఆర్డర్ లో భారత ఆట తీరు రోజు రోజుకు దారుణంగా మారింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో… ఆకాష్ దీప్ (Akash deep) , జస్ప్రిట్ బుమ్రా నెలకొల్పిన భాగస్వామ్యం మాత్రం భారత్ ను ఈ మ్యాచ్ లో బ్రతికించింది.
వర్షం ఈ టెస్ట్ లో కీలకపాత్ర పోషించినా… భారత పరువు కాపాడింది మాత్రం ఈ ఇద్దరే. కెఎల్ రాహుల్ (KL Rahul) 84 పరుగుల వద్ద అవుటైన తర్వాత… జడేజాతో నితీష్ కుమార్ రెడ్డి జత అయ్యాడు. అనంతరం ఏడవ వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీష్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సిరాజ్ ఎక్కువ సేపు నిలవలేదు. ఈ టైం లో భారత్ ముందు ఫాలో ఆన్ గండం నుంచి బయటపడటమే కీలకంగా కనపడింది. ఈ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన బూమ్రా, ఆకాష్ దీప్ ఆసిస్ బౌలర్ల ఎత్తులకు చిక్కలేదు.
జడేజా అవుట్ అయ్యే సమయానికి భారత్… ఫాలో నుంచి బయటపడటానికి 33 పరుగులు కావాలి. అక్కడి నుంచి బూమ్రా, ఆకాష్ దీప్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ… ఫాలో ఆన్ నుంచి బయటపడేసారు. ఆసిస్ కెప్టెన్ కమ్మిన్స్ ఎంత ప్రయత్నం చేసినా వీరు అవుట్ కాలేదు. ఆకాష్ దీప్ ఫోర్లు, సిక్సులతో కాసేపు అలరించాడు. మ్యాచ్ ముగిసే ముందు అతను కొట్టిన సిక్స్… మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది. మ్యాచ్ ముగిసే సమయానికి బుమ్రా 10 పరుగులతో… దీప్.. 27 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు. వీళ్ళిద్దరూ 10వ వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.






