Yemen Nimisha priya: యెమెన్ లో నిమిషా ప్రియాకు మరణశిక్ష …. విడుదలకు కృషి చేస్తాన్నామన్న విదేశాంగశాఖ
యెమెన్ దేశంలో అక్కడి వ్యక్తిని హత్య చేసిన కేసులో దోషిగా తేలి ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ(Nimisha priya) కు ఆ దేశ అధ్యక్షుడి కరుణ దక్కలేదు. ఆమె పెట్టుకున్న క్షమాభిక్ష పిటిన్‌ను యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి (Rashad Al Alimi) తిరస్కరించారు. దాంతో ఆమెకు మరణశిక్షకు అధ్యక్షుడి ఆమోదం లభించినట్లయ్యింది. అయితే నర్సు మరణశిక్షకు ఆమోదం తెలిపిన అధ్యక్షుడు ఆ శిక్ష అమలుకు మాత్రం నెల రోజుల గడువు ఇచ్చారు.
నిమిషా ప్రియ 2017లో తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ పౌరుడి నుంచి తన పాస్‌పోర్ట్‌ను తీసుకునే క్రమంలో అతడికి మత్తమందు ఇంజెక్ట్ చేసి హతమార్చినట్లు కేసు నమోదైంది. అనంతరం పోలీసుల విచారణలో ఆమె హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ట్రయల్ కోర్టు 2018లో నిమిషాకు ఉరిశిక్ష విధించింది. దానిపై నర్సు నిమిషా సుప్రీంకోర్టు (Supreme Court) లో అప్పీల్ చేసింది. కానీ, సుప్రీంకోర్టు కింది కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో నిమిషా ప్రియా యెమెన్ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరింది. తాజాగా యెమెన్ అధ్యక్షుడు ఆమె క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు.తాజాగా ఈ అంశంపై విదేశాంగశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ప్రియాను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించడాన్ని అర్థం చేసుకోగం. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది అని పేర్కొన్నారు.






