America: అమెరికా జనాభా ఎంతో తెలుసా?
అమెరికా జనాభా (US population) 34 కోట్లకు చేరుకుంది. విదేశీయుల వలసలతో దేశంలో జనాభా వృద్ధిరేటు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాదిలో నమోదైంది. అమెరికా జనాభా లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. 2001 తర్వాత ఈ ఏడాది నమోదైన 1శాతం జనాభా వృద్ధిరేటు 23 ఏళ్ల (23 years) లో అత్యధికం కావడం గమనార్హం. 2021లో కరోనా కారణంగా వలసలు తగ్గి పోవడంతో కేవలం 0.2 శాతం వృద్ధిరేటే నమోదైంది. ఈ ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది పెరిగారు. 2023, 24లో 33 లక్షల మంది పెరగ్గా అందులో 84 శాతం వలసల కారణంగానే కావడం గమనార్హం. 2023, 24లలో మరణాల కంటే జననాలే అత్యధికంగా నమోదయ్యాయి. ఈ సమయంలో 5,19,000 మంది జన్మించారు.






