ICC: ఐసీసీని వణికిస్తున్న స్టార్… పాకిస్తాన్ ను లైట్ తీసుకుంటారా…?
2025 లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ (India) నిరాకరించిన నేపథ్యంలో సంబంధించి ఏదైనా సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. దుబాయ్ లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు టోర్నమెంట్‌ను 'హైబ్రిడ్' పద్ధతిలో నిర్వహించడానికి ఐసిసి అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ తరుణంలో స్టార్ బ్రాడ్ కాస్టర్… ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు రాసిన ఒక లేఖ సంచలనం అయింది. టోర్నీ నుంచి భారత్, లేదా పాకిస్తాన్ (Pakistan) వైదొలగాలని నిర్ణయించుకుంటే టోర్నమెంట్ పై ఏ విధంగా ప్రభావం పడుతుందో ఆ లేఖలో వెల్లడించారు. జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… తమకు భారీ నష్టం వస్తోందని సదరు బ్రాడ్ కాస్టర్ ఐసిసికి రాసిన లేఖలో ప్రస్తావించింది. నాలుగేళ్ల కాలానికి వారికి మీడియా హక్కులను ఐసీసీ విక్రయించింది. కాని భారత్ మ్యాచ్ లను మాత్రం విడిగా విక్రయించారు.
కేవలం స్టార్ ఇండియాతో ఒప్పందం ప్రకారం… ప్రపంచ వ్యాప్తంగా వారికి వచ్చే ఆదాయ శాతంలో భారత్ వాటా ప్రకారం 90 శాతం. లేఖ ప్రకారం చూస్తే… భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంటే, ఐసిసి… మొత్తం మీడియా హక్కులను 750 మిలియన్ డాలర్లకు విక్రయించగా ఆ మొత్తంలో… 90 శాతాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, పాకిస్థాన్ వైదొలగాలని నిర్ణయించుకుంటే, ఐసీసీ ఆ మొత్తంలో 10 శాతం కంటే తక్కువ మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీనితో భారత్ కు అనుకూలంగా ఇప్పుడు ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. పాకిస్తాన్ ను ఎలా అయినా ఒప్పించాలని ఐసీసీ పట్టుదలగా ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఐసీసీ నిండా మునిగిపోయే అవకాశం ఉంటుంది.






