Gukesh: ప్రపంచ చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్
సింగ్‌పూర్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చైనా గ్రాండ్ మాస్టర్‌ను ఓడించి గుకేశ్ (Gukesh) టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతిపిన్న వయస్సు ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలా డిరచాడు. అద్బుతమైన చెక్‌మెట్‌లతో డిఫెండింగ్ ఛాంపియన్‌నే ఈ యువ గ్రాండ్ మాస్టర్ ఓడించాడు. ఈ క్రమంలో 140 కోట్ల మంది భారతీయులు గుకేశ్ విజయాన్ని కొనియాడు తున్నారు. ప్రపంచ చదరంగంలో భారత గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్న గుకేశ్‌కు ఉత్తర అమెరికా తెలుగు సంఘం అభినందన లు తెలియజేసింది. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగమల్లేశ్వర పంచుమర్తి గుకేశ్‌ను అభినంది స్తూ, ప్రపంచ చదరంగంపై తెలుగువాడు విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు.
18 ఏళ్ల వయసులోనే…
భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్లో డిఫెండిరగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డిరగ్ లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5`6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5`6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణాయక చివరి పోరులో గుకేశ్ తన సత్తాను ప్రదర్శించాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజయనాదం చేశాడు. చివరి గేమ్‌కు ముందు చెరో రెండు గేమ్‌లు గెలిచిన ఇద్దరూ సమంగా ఉన్నారు. ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ‘టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చేది. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించి లిరెన్‌ను పడగొట్టాడు. తద్వారా క్లాసికల్ విభాగంలో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ (2012) తర్వాత వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌గా గుకేశ్ నిలిచాడు.
ప్రముఖుల అభినందనలు
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు. నిన్ను చూసి యావత్ జాతి గర్వపడుతోంది. ప్రపంచ చెస్‌లో భారత్ కూడా ప్రచండ శక్తి అని నీ విజయం చాటింది. భారతీయులందరి తరఫున నీకు శుభాకాంక్షలు. భవిష్యత్తులోనూ నీవు ఇలాగే రాణించాలి.. అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన అభినందన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అభినందనలు తెలియజేస్తూ, కెరీర్ తొలినాళ్లలోనే సంచలన విజయం సాధించావు. ఈ విజయం భారత చెస్ పుటల్లో కేవలం నీ పేరును లిఖించడమే కాదు… కలల్ని సాకారం చేసుకోవాలనుకునే లక్షల మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్‌లో మరెన్నో ఘనవిజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అని పేర్కొన్నారు. మాజీ చాంపియన్ విశ్వనాధన్ ఆనంద్.. ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన గుకేశ్‌కు శుభాభినందనలు. నీవు సాధించిన టైటిల్ చెస్కే గర్వకారణం. నీవు ఎదుర్కొన్న తీరు మాత్రం అద్భుతం.. అన్నారు.






