German President: పార్లమెంట్ ను రద్దు చేసిన జర్మనీ అధ్యక్షులు.. ఎన్నికలు ఎప్పుడో తెలుసా?
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ (Frank Walter) పార్లమెంటును (Parliament ) రద్దు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ఎన్నికలు (Elections) నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ (Olaf Scholz) కు తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన విషయం తెలిసిందే. 733 మంది సభ్యులున్న సభలో ఓటింగ్ జరగ్గా ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు. 116 మంది గైర్హాజరయ్యారు. మెజారిటీకి 376 ఓట్లు అవసరం దీంతో ముందుగా నిర్ణయింంచిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. నవంబరు 6వ తేదీన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి మైనారిటీ ప్రభుత్వానికి షోల్జ్ నాయకత్వం వహిస్తున్నారు.






