Gaza : గాజా పాలస్తీనీయులదే.. ట్రంప్ వ్యాఖ్యలకు చైనా కౌంటర్

గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను చైనా (China) ఖండిరచింది. గాజా ప్రాంతం పాలస్తీనీయులదే. అక్కడి నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేసింది. అలాగే అరబ్ లీగ్ నుంచీ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. వారిని తరలించడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే, బాధ్యత తీసుకుని గాజాను పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu )తో భేటీ సందర్భంగా ట్రంప్ చెప్పారు. తాజాగా జోర్దాన్ రాజు అబ్దుల్లా-2తో భేటీ అయిన ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. గాజాలో రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారం చేసే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు. దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.