America : అమెరికాలో పిట్టల్లా రాలిన డ్రోన్లు
అమెరికాలో నిర్వహించిన ఓ డ్రోన్ల ప్రదర్శనలో ఊహించిన ప్రమాదం జరిగింది. క్రిస్మస్ నేపథ్యంలో ఫ్లోరిడా(Florida) లోని ఇయోలా సరస్సుపై ఏరియల్ లైట్ షోలో భాగంగా డ్రోన్ల (drone ) ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీంతో దానిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రదర్శన జరుగుతున్న సమయంలో అనుకోకుండా గాలిలో ఎగురుతున్న వందల కొద్దీ డ్రోన్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. అవి వేగంగా వచ్చి కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులపై పడడంతో ఏడేళ్ల బాలుడితో సహా పలువురు గాయాలపాలయ్యారు. గాయపడిన పిల్లాడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.






